ప్రేమ పేరుతో మోసం: యువతి ఆత్మహత్య

ప్రేమించిన వ్యక్తి వేధింపులు, బెదిరింపుల కారణంగా మనస్తాపం చెందిన ఒక యువతి ఆత్మహత్యకు పాల్పడింది. మంచిర్యాల జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.

వివరాలు:
మంచిర్యాలకు చెందిన 23 ఏళ్ల యువతికి, డిగ్రీ చదివే రోజుల్లో రంగుల శ్రీకాంత్ అనే యువకుడితో పరిచయమైంది. ఈ పరిచయం ప్రేమగా మారింది. అయితే, పెళ్లి ప్రస్తావన తీసుకురావడంతో శ్రీకాంత్ డబ్బులు డిమాండ్ చేయడం మొదలుపెట్టాడు. డబ్బులు ఇవ్వకపోతే తమ ఇద్దరి సన్నిహిత ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించాడు. శ్రీకాంత్‌తో పాటు అతని కుటుంబ సభ్యులు కూడా యువతిని వేధించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. యువతి మరణానికి కారణమైన శ్రీకాంత్‌పై చర్యలు తీసుకోవాలని ఆమె కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

Read More : పారిశుద్ధ్యంపై మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆకస్మిక పర్యటన