నగరంలోని బస్తీల్లో పారిశుద్ధ్య పరిస్థితులను తెలుసుకునేందుకు హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆకస్మికంగా క్షేత్రస్థాయి పర్యటన చేశారు. జూబ్లీహిల్స్ పరిధిలోని అంబేద్కర్ నగర్, ఉదయ్ నగర్ బస్తీలను ఆమె సందర్శించారు.
అధికారులకు మేయర్ ఆదేశాలు:
- వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు పారిశుద్ధ్య కార్యక్రమాలను ముమ్మరం చేయాలని మేయర్ అధికారులను ఆదేశించారు.
- వ్యర్థాల తొలగింపులో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
- బస్తీల్లో ఇష్టారీతిన నిర్మాణ వ్యర్థాలను పడేసేవారిపై కూడా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ పర్యటనలో మేయర్‌తో పాటు జోనల్ కమిషనర్ అనురాగ్ జయంత్ కూడా పాల్గొన్నారు.

2 thoughts on “పారిశుద్ధ్యంపై మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆకస్మిక పర్యటన”
Comments are closed.