రేవంత్‌రెడ్డి కేసుపై పిటీషనర్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం

revanthreddy

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు దాఖలు చేసిన పిటీషనర్ పెద్దిరాజుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు న్యాయమూర్తి మౌసమి భట్టాచార్యకు అఫిడవిట్ రూపంలో క్షమాపణలు చెప్పాలని సీజేఐ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. రేవంత్‌రెడ్డిపై పెద్దిరాజు దాఖలు చేసిన కేసును గతంలో తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. అయితే, ఆ కేసును నాగ్‌పూర్ బెంచ్‌కి బదిలీ చేయాలని పెద్దిరాజు సుప్రీంకోర్టులో ట్రాన్స్‌ఫర్ పిటీషన్ దాఖలు చేశారు. ఈ ప్రక్రియలో హైకోర్టు న్యాయమూర్తిపైనా పెద్దిరాజు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.

దీంతో, పిటీషన్ తయారుచేసిన ఏఓఆర్, అలాగే పెద్దిరాజుపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. న్యాయమూర్తి మౌసమి భట్టాచార్యకు వెంటనే క్షమాపణలు చెప్పాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ కేసు తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

Read More : హైదరాబాద్‌లో దేశంలోనే తొలి ఆటోమేటెడ్ మల్టీ-లెవెల్ పార్కింగ్

One thought on “రేవంత్‌రెడ్డి కేసుపై పిటీషనర్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం

Comments are closed.