తెలంగాణ అసెంబ్లీ సమావేశాలపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా ఆయన అసెంబ్లీ సమావేశాల తీరును విమర్శించారు. గతంలో ప్రజలు ఆసక్తిగా చూస్తున్న అసెంబ్లీ ఇప్పుడు వివాదాస్పద ఘటనలతో శ్రద్ధ ఆకర్షిస్తున్నదని పేర్కొన్నారు.
“ఇప్పుడు అసెంబ్లీలో బట్టలు విప్పుడు, కత్తులు దూసుడే కనిపిస్తోంది”
మల్లారెడ్డి మాట్లాడుతూ, ఒకప్పుడు అసెంబ్లీ సభలంటే ప్రజలకు ఆసక్తికరంగా ఉండేదని, మాజీ ప్రధాని వాజపేయి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాంటి నాయకుల ప్రసంగాలకు ప్రజలు టీవీలకు అట్టుకునిపోయేవారని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రసంగాలను ఆసక్తిగా అనుసరించేవారని చెప్పారు. అయితే, ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో వివాదాస్పద ఘటనలే ప్రధానంగా మారాయని విమర్శించారు.
అసెంబ్లీ లాబీలో మల్లారెడ్డి – ఎమ్మెల్యే వివేక్ ఆసక్తికర సంభాషణ
అసెంబ్లీ లాబీలో మల్లారెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ మధ్య జరిగిన సంభాషణ కూడా ఆసక్తి కలిగించింది. మల్లారెడ్డి, “నమస్తే మంత్రి గారు” అంటూ వివేక్‌ను పలకరించగా, ఆయన “థాంక్స్ మల్లన్న” అని సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి, రాష్ట్రంలో ప్రస్తుతం కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వివేక్ ఫ్యామిలీల హవా నడుస్తోందని వ్యాఖ్యానించగా, దీనిపై వివేక్, “బీఆర్‌ఎస్ హయంలో కేసీఆర్, మల్లారెడ్డిదే హవా నడిచింది” అని సమాధానమిచ్చారు. ఈ అనుసంధానంతో ఇద్దరి మధ్య స్నేహపూర్వక వాతావరణం నెలకొంది.
మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి.
Read More : కేటీఆర్‌కు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మాస్ వార్నింగ్

One thought on “అసెంబ్లీ సమావేశాలపై మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు”
Comments are closed.