2005 ఆగస్టు 10న విడుదలై భారీ విజయాన్ని సాధించిన సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమా ‘అతడు’ మళ్లీ థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతోంది. మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని ఆగస్టు 9న ప్రత్యేకంగా రీ-రిలీజ్ చేయనున్నట్లు నిర్మాత మురళీ మోహన్ ప్రకటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ఇప్పుడున్న సినిమాల ప్రదర్శన ప్రమాణాలను దృష్టిలో ఉంచుకుని ‘అతడు’ సినిమాను సాంకేతికంగా అప్‌డేట్ చేసి మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. అప్పట్లో విజయం సాధించిన ఈ సినిమా మళ్లీ ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది” అని తెలిపారు.
ప్రేక్షకులు తమ ప్రియ నటుడి పుట్టినరోజును మరింత ప్రత్యేకంగా జరుపుకునేలా ఈ రీ-రిలీజ్ ఉంటుందని ఆయన అన్నారు.
Read More : రెహమాన్–ఆల్ట్‌మన్ భేటీ…

One thought on “మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా ‘అతడు’ రీ-రిలీజ్ ?”
Comments are closed.