యంగ్ అండ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ హోదా అందుకున్న ఆమె, తన అందం, అభినయం, డ్యాన్స్‌తో మంచి ఫ్యాన్‌బేస్‌ను సంపాదించుకుంది. సినిమాలకంటే ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శ్రీలీల ఎప్పటికప్పుడు క్రేజీ ఫోటోలు, ఫన్నీ వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఎంటర్‌టైన్ చేస్తుంటుంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్యాన్స్‌తో చేసిన చిట్‌చాట్‌లో ఆమె ప్రేమపై చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి.
‘‘లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి?’’ అని అడిగిన ఓ అభిమానికి ఆమె స్పందిస్తూ – ‘‘మీరు ప్రేమను కనుగొంటే, గాలి కూడా వెళ్లలేనంత గట్టిగా దాన్ని పట్టుకోండి’’ అంటూ చెప్పిన మాటలు ఫాలోవర్లను ఆకట్టుకుంటున్నాయి. శ్రీలీల స్టైల్‌లో చెప్పిన ఈ డైలాగ్‌కు నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ ఫీలింగ్స్ ఆమె నిజ జీవితానికి దగ్గరగా ఉన్నాయా? అనే ఉత్సుకత కూడా ప్రేక్షకుల్లో పెరిగింది. ఇటీవల బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్‌తో ఆమె డేటింగ్‌లో ఉందన్న వార్తలు బీటౌన్‌లో జోరుగా వినిపిస్తున్నాయి.
బాలీవుడ్ ఎంట్రీ సినిమాతో ఇద్దరూ కలిసిపనిచేస్తుండగా, సెట్స్‌పై వారి కెమిస్ట్రీ హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల బిహైండ్ ది సీన్స్ పిక్స్ వైరల్ అయ్యాయి. అదేవిధంగా కార్తీక్ తల్లి చేసిన కామెంట్స్ కూడా ఈ వార్తలకు బలం చేకూర్చాయి. అయితే, ఈ జోడీ నిజంగానే ప్రేమలో ఉన్నారా? అన్నది ఇంకా అధికారికంగా బయటపడాల్సి ఉంది. అయితే శ్రీలీల ప్రేమపై చెప్పిన మాటలు మాత్రం ఫాలోవర్ల హృదయాలను హత్తుకుంటున్నాయి.
