ఏపీ డీజీపీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టులు

ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టు కార్యకలాపాలపై పోలీసులు దాడులు కొనసాగిస్తున్న తరుణంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏపీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హరీశ్ కుమార్ గుప్తా ఎదుట పలువురు మావోయిస్టులు లొంగిపోయారు. ఈ సందర్భంగా వారు తమ వద్ద ఉన్న ఆయుధాలను కూడా అధికారులకు అప్పగించారు.

డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మీడియాతో మాట్లాడుతూ, ఏజెన్సీ ప్రాంతాల్లో మావోయిస్టుల లొంగుబాటు శాంతి ప్రక్రియలో ఒక పెద్ద ముందడుగు అని అన్నారు. ఏవోబీ (ఆంధ్ర–ఒడిశా సరిహద్దు) పరిధిలో పోలీసులు నిర్వహించిన ఆపరేషన్లలో పెద్ద మొత్తంలో డంప్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న పునరావాస పథకాలతో ప్రేరేపితులై మావోయిస్టులు లొంగిపోతున్నారని డీజీపీ తెలిపారు. లొంగిపోయిన వారికి చట్టం ప్రకారం తగిన రక్షణ, పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

Read More : ఈరోజు రాత్రి సింగపూర్ పర్యటనకు సీఎం

One thought on “ఏపీ డీజీపీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టులు

Comments are closed.