హైదరాబాద్‌లోని తెలంగాణ పోలీస్ అకాడమీ ప్రాంగణంలో అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ (AMVI) శిక్షణ తరగతుల ప్రారంభ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజా బహుదూర్ వెంకట రామిరెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నూతనంగా ఎంపికై నియామక పత్రాలు అందుకున్న AMVI లకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. శిక్షణ కోసం అకాడమీకి హాజరైన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. వారు రవాణా శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. సమర్థవంతమైన శిక్షణ పొందడంతో పాటు సేవా మనోభావంతో పనిచేయాలని సూచించారు.
మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్లు రోడ్డు భద్రతలో కీలక పాత్ర పోషిస్తారని, వారి పనితీరు ప్రజలకు నేరుగా ప్రభావం చూపుతుందని గుర్తుచేశారు. నూతన AMVI లు తమ విధులు నిర్వర్తించేటప్పుడు నిబద్ధత, ప్రామాణికత ప్రదర్శించాలని రాజా బహుదూర్ వెంకట రామిరెడ్డి పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పలువురు ఉన్నతాధికారులు, శిక్షణాధికారి, తదితరులు పాల్గొన్నారు.
