హైదరాబాద్‌లో ఉదయం నుంచి కురుస్తున్న వర్షం నగర వాసులకు తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెట్టింది. కూకట్‌పల్లిలో రోడ్డు కొట్టుకుపోవడంతో మ్యాన్‌హోల్ బయటపడటంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వై జంక్షన్ నుంచి కూకట్‌పల్లి బీజేపీ కార్యాలయం వరకు వాహనాలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో ఓ అంబులెన్స్ కూడా ట్రాఫిక్‌లో చిక్కుకుపోయింది. అదనంగా భరత్‌నగర్ వంతెనపై కూడా ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Read More : కేంద్ర ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

2 thoughts on “కూకట్‌పల్లిలో వర్షం కారణంగా భారీ ట్రాఫిక్ జామ్”
Comments are closed.