కేటీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన కవిత

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షల జల్లు కురుస్తోంది. వివిధ రంగాల ప్రముఖులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా కేటీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో కేటీఆర్ సోదరి, ఎమ్మెల్సీ కవిత కూడా స్పందించారు. “అన్నయ్యా.. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే!” అంటూ ట్వీట్ చేస్తూ కేటీఆర్‌ను ట్యాగ్ చేశారు.

ఇటీవల బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు కవిత పంపిన లేఖతో కేటీఆర్–కవితల మధ్య దూరం పెరిగిందనే ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో వినిపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కవిత చేసిన ట్వీట్ ప్రాధాన్యం సంతరించుకుంది.

Read More : కూకట్‌పల్లిలో వర్షం కారణంగా భారీ ట్రాఫిక్ జామ్

One thought on “కేటీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన కవిత

Comments are closed.