తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ తోషిబా ముందుకు వచ్చింది. సంగారెడ్డి జిల్లా రుద్రారం వద్ద రెండు కొత్త మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది.
ఈ యూనిట్ల నిర్మాణానికి సంబంధించిన భూమిపూజ కార్యక్రమం ఈరోజు జరిగింది. రూ.347 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు కంపెనీ తెలిపింది. ఇప్పటికే రెండు యూనిట్లు ఉన్న రుద్రారంలో, ఈ రెండు కొత్త యూనిట్ల ఏర్పాటుతో కంపెనీ విస్తరణ జరగనుంది. ఈ పెట్టుబడులు స్థానికంగా ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.
Read More : విచారణకు బండి సంజయ్ హాజరు !

One thought on “తెలంగాణలో తోషిబా పెట్టుబడులు”
Comments are closed.