రేవంత్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్

KTR

తెలంగాణ రాష్ట్రంలో పేదల ఇళ్ల కూల్చివేతలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మిస్ వరల్డ్ పోటీలో పాల్గొనే అతిథుల పర్యటన కోసం వరంగల్‌లో పేదల ఇళ్లు కూల్చుతున్నారని ఆరోపిస్తూ, ఇది ప్రజాపాలనకు సరైన ఉదాహరణ కాదని ఆయన మండిపడ్డారు.

ఈ విషయంపై ట్విట్టర్ (ఎక్స్) ద్వారా స్పందించిన కేటీఆర్, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ పలు కీలక ప్రశ్నలు సంధించారు. ‘‘హలో రాహుల్ గాంధీ గారు, బుల్డోజర్ కంపెనీలతో మీకు ఏమైనా రహస్య ఒప్పందాలున్నాయా? ప్రతిరోజూ పేదల ఇళ్లు ధ్వంసం చేయడమే మీ పాలనా విధానమా?’’ అని కేటీఆర్ ప్రశ్నించారు.

ముఖ్యంగా మిస్ వరల్డ్ పోటీ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 200 కోట్ల ప్రజా ధనాన్ని ఖర్చు చేసి, విందులు పెడుతోందని, అదే సమయంలో పేదల ఇళ్లు కూల్చడం అమానవీయమని తీవ్రంగా విమర్శించారు. ‘‘పేద ప్రజల జీవితాలు రాక్షస బుల్డోజర్ల కింద నలుగుతున్నాయి. ఇది సిగ్గుచేటు. కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై సమాధానం చెప్పాలి,’’ అని ట్వీట్‌ చేశారు.

కేటీఆర్ పోస్ట్ చేసిన వరంగల్‌ కూల్చివేతల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై సామాన్యులు కూడా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పేదలపై జరిగే దాడులపై ప్రభుత్వం తక్షణమే స్పందించి, బాధితులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

Read More : మిస్ వరల్డ్ పోటీదారులు బుధవారం వరంగల్, ములుగు పర్యటన.

One thought on “రేవంత్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్

Comments are closed.