మిస్ వరల్డ్ పోటీదారులు బుధవారం వరంగల్ మరియు ములుగు జిల్లాలను సందర్శించనున్నారు. ఈ సందర్భంగా, పర్యాటక శాఖ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. 35 మంది అందాల భామల బృందం వరంగల్ నగరంలో వేయిస్తంభాల ఆలయ నిర్మాణం, శిల్ప వైభవం, వరంగల్ కోటలో కాకతీయుల కీర్తి తోరణం, శిల్పసంపదను పరిశీలించనున్నారు.
మరో 22 మందితో కూడిన బృందం హైదరాబాద్ నుంచి నేరుగా ములుగు జిల్లాలోని రామప్ప ఆలయానికి చేరుకుని అక్కడి శిల్ప సౌందర్యాన్ని చూశి, పేరిణి నృత్య ప్రదర్శనను తిలకించనున్నారు. ఈ బృందం సాయంత్రం 4 గంటలకు ములుగు హరిత హోటల్‌కు చేరుకుని, రామప్ప ఆలయ దర్శనంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షిస్తారు. రాత్రి 8 గంటలకు విందు అనంతరం వారు హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు.
ఈ పర్యటనలో తెలంగాణ రాష్ట్రం ఖ్యాతి ప్రతిబింబించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. “తెలంగాణ… జరూర్ ఆనా..” అనే థీమ్‌తో, అందాల భామలకు ప్రాచీన ఆలయాలు, పర్యాటక ప్రాంతాల అందాలు ప్రదర్శించాలనే ప్రణాళిక రూపొందించబడింది.
ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్త్ ఏర్పాట్లు చేసారు. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు.
Read More : శంషాబాద్ విమానాశ్రయంలో ఉగ్రవాది పట్టుకున్న వీడియో.

3 thoughts on “మిస్ వరల్డ్ పోటీదారులు బుధవారం వరంగల్, ములుగు పర్యటన.”
Comments are closed.