సోఫియా ఖురేషీపై వ్యాఖ్యలపై ఎఫ్ఐఆర్‌కు ఆదేశం.

మధ్యప్రదేశ్ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న విజయ్ షా, కల్నల్ సోఫియా ఖురేషీపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో తీవ్ర విమర్శలకు లోనయ్యారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై తక్షణమే కేసు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్‌కు (డీజీపీ) దీనిపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

ఈ వివాదాస్పద పరిణామం పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో మతోన్మాదులు పాల్పడిన ఉగ్రదాడిపై స్పందిస్తూ, “పాక్ ముస్లింలు దాడులు చేస్తే, వారిని సమర్థించేవారిని పాక్ పంపించి ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టాం” అని మంత్రి విజయ్ షా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు నేరుగా కల్నల్ సోఫియా ఖురేషీ మతాన్ని ఉద్దేశించి చేసినవిగా తీవ్రంగా ఆక్షేపణకు గురయ్యాయి.

ఈ వ్యాఖ్యలు సోఫియాపై వ్యక్తిగత దాడిగా భావించిన పలు వర్గాలు న్యాయపరంగా స్పందించాయి. కేసు విచారణకు వచ్చిన హైకోర్టు, మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి నుంచి ఇటువంటి వ్యాఖ్యలు అసహ్యంగా ఉన్నాయని పేర్కొంది. సమాజంలో భిన్నాభిప్రాయాలను కలగజేసేలా ఉన్న ఇటువంటి వ్యాఖ్యలు సహించలేవని స్పష్టం చేసింది.

దీంతో పాటు, విజయ్ షాపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మధ్యంప్రదేశ్ డీజీపీకి ఆదేశాలు ఇచ్చింది. ప్రజా ప్రతినిధుల వ్యాఖ్యలు బాధ్యతతో ఉండాలని, అవి సామాజిక సౌభ్రాతృత్వాన్ని దెబ్బతీయకూడదని న్యాయస్థానం గుర్తుచేసింది.

Read More : ఉదయ్‌పూర్ మార్బుల్ వ్యాపారుల కీలక నిర్ణయం