కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ తీవ్ర విమర్శలు

ktr

తెలంగాణలో నీటి సమస్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. సోషల మీడియా వేదికగా కాంగ్రెస్ పాలనపై విమర్శల దాడికి దిగారు. కేటీఆర్ తన ఎక్స్ (X) ఖాతాలో ట్వీట్ చేస్తూ… “పల్లెల్లో సాగునీళ్లు లేవు, పట్టణాల్లో తాగునీళ్లు లేవు. గతంలో ఇంటింటికీ నల్లా నీళ్లు అందితే, ఇప్పుడు సాగు, తాగునీళ్లు లేక ప్రజలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా, గోదావరి నదుల్లో నీరు ఉన్నా వాటిని ఎత్తిపోసే యత్నం చేయకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ కక్షసాధింపు చర్య అని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు గేట్లు తెరిచిపెట్టడం, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను ఆపేసిన విధానం దారుణమని పేర్కొన్నారు. కేటీఆర్ తిప్పిన ఆరోపణల ప్రకారం, రిజర్వాయర్లు, చెరువులు ఖాళీగా ఉన్నాయి, బోర్లు అడుగంటుతున్నాయి, పొలాలు వాడిపోతున్నాయి. సాగునీళ్లు లేకపోవడంతో పాటు తాగునీళ్లు కూడా అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

రోజుకు ఎనిమిది వేల ట్యాంకర్ల డిమాండ్ పెరగడం, అధికారుల స్పందన లేకపోవడం పాలన వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. “కాంగ్రెస్ పాపం, ప్రజలకు శాపం. జాగో తెలంగాణ జాగో” అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఈ వ్యాఖ్యలు రాష్ట్రంలో నీటి సమస్యలపై రాజకీయ దుమారం రేపే అవకాశముంది.

Read More : అప్పు వేధింపులతో మహిళ ఆత్మహత్యాయత్నం