కేటీఆర్‌పై మంత్రి సీతక్క ఘాటు సవాల్

seethakka

తెలంగాణలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. బీఆర్ఎస్ నేత కేటీఆర్ పై మంత్రి సీతక్క సవాల్ విసిరారు. బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఇంటికి కేటీఆర్ వెళ్లలేదని, బీజేపీతో ఎలాంటి కుమ్మక్కు జరగలేదని బహిరంగంగా చెప్పగలరా అని ఆమె ప్రశ్నించారు.

లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు డిపాజిట్లు కూడా రాకపోవడానికి కారణం బీజేపీతో చీకటి ఒప్పందం కుదుర్చుకోవడమేనని సీతక్క ఆరోపించారు. “కేటీఆర్ ఎన్ని అబద్ధాలు చెప్పినా ఒక రోజు నిజం బయటకు వస్తుంది. ఆయన అబద్ధాలు సీఎం రమేష్ మాటల ద్వారా బయటపడ్డాయి” అని ఆమె ఘాటుగా విమర్శించారు.

సీతక్క వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Read More : పెద్దమ్మ దేవాలయం కూల్చివేతపై కరాటే కళ్యాణి ఆగ్రహం