హైదరాబాద్ కల్తీ కల్లు బాధాంతకం: కేటీఆర్ పరామర్శ

హైదరాబాద్‌లో కల్తీ కల్లు తాగి ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర కలకలం రేపింది. ఈ విషాద ఘటనపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఆరుగురు అమాయకులు కల్తీ కల్లు బారిన పడి మరణించడం ఎంతో బాధాకరమని ఆయన పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలవాలని కోరుతూ, ఒక్కో కుటుంబానికి రూ. 20 లక్షల నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులకు మెరుగైన వైద్యం అందించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరారు. “కుటుంబాల కోసం రోజువారి కష్టజీవులు చేస్తున్న ప్రజలు ఇలా కల్తీ కల్లు బారిన పడకూడదు. వారికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఇప్పటివరకు సరైన చర్యలు తీసుకోకపోవడం దారుణం. ఇలాంటి దారుణ ఘటనలు మళ్లీ జరగకుండా ప్రభుత్వం తీసుకోనున్న చర్యలను తక్షణమే ప్రజలకు తెలియజేయాలి,” అని కేటీఆర్ అన్నారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ (X) వేదికగా స్పందించారు.

ఇక తాజా సమాచారం మేరకు, ఈ ఘటనలో మరొకరు ప్రాణాలు కోల్పోయారు. సాయిచందు కాలనీకి చెందిన నర్సమ్మ (54) అనే మహిళ ఈఎస్ఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. దీంతో కల్తీ కల్లు మృతుల సంఖ్య ఆరుగురికి చేరింది. ఈ ఘటనతో నగరంలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

Read More : హామీలపై చర్చకు సిద్ధమంటూ హెచ్చరిక

One thought on “హైదరాబాద్ కల్తీ కల్లు బాధాంతకం: కేటీఆర్ పరామర్శ

Comments are closed.