కొన్ని రోజులుగా నయనతార–విఘ్నేశ్ శివన్ జంట విడాకులపై కోలీవుడ్‌లో ఊహాగానాలు ఊపందుకున్నాయి. సోషల్ మీడియాలో వ్యాప్తి చెందిన ఈ వార్తలకు నయనతార తాజాగా ఘాటైన సమాధానం ఇచ్చారు.
తన భర్త విఘ్నేష్ శివన్‌తో సన్నిహితంగా ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, “మా గురించి అర్థంలేని వార్తలు చూసినప్పుడు ఇది మా స్పందన” అని స్పష్టం చేసింది. ఈ పోస్టుతో ఆమె విడాకుల పుకార్లకు స్వయంగా తెరదించారు. అయితే, ఇటీవల నయనతార చేసిన ఓ పోస్ట్‌లో “తెలివితక్కువ వ్యక్తిని పెళ్లి చేసుకోవడం ఓ పొరపాటు. భర్త చేసిన తప్పులకు భార్య బాధ్యత వహించాల్సిన అవసరం లేదు” అనే వాక్యాలు ఉండడంతో, వీరి మధ్య విభేదాలు వచ్చినట్టు పుకార్లు చెలరేగాయి. ఆ పోస్ట్‌ను ఆమె కొద్దిసేపటికే తొలగించివేయడం మరింత అనుమానాలకు దారితీసింది.
ఈ నేపథ్యంలో ఆమె తాజా ఫొటో పోస్ట్‌తో ఈ కథనాలకు తాంతాగా ముగింపు పలికారు. ప్రస్తుతం నయనతార కుటుంబంతో కలిసి హాలీడే ఎంజాయ్ చేస్తోంది.
Read More : బాహుబలి మరోసారి థియేటర్లలో సందడి చేయబోతున్నాడు!

One thought on “విడాకుల వదంతులకు నయనతార ముగింపు..”
Comments are closed.