సంగారెడ్డి జిల్లా పెద్దాపూర్ సమీపంలో ముంబై నేషనల్ హైవేపై సోమవారం ఉదయం దారుణ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ అదుపుతప్పి బోల్తా పడడంతో రెండు కార్లు నుజ్జునుజ్జయ్యాయి. ఈ ప్రమాదం తీవ్ర ఉద్రిక్తతను సృష్టించింది.
అయితే, అదే సమయంలో జహీరాబాద్ పర్యటనకు వెళ్తున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ఆ ఘటనను స్వయంగా చూశారు. వెంటనే తన వాహనం ఆపి, తన సిబ్బంది, స్థానికుల సహాయంతో ప్రమాద గ్రస్థులను కార్లలో నుంచి బయటకు లాగారు. బాధితులను క్షేమంగా బయటకు తీసిన తర్వాత, స్వయంగా తన కారులో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి మానవత్వం చాటుకున్నారు.
ప్రమాదం విషయాన్ని జిల్లా కలెక్టర్, ఎస్పీకి తెలియజేసిన హరీష్ రావు.. అవసరమైన సహాయక చర్యలు తక్షణమే చేపట్టాలని అధికారులకు సూచించారు. బాధితులకు మెరుగైన చికిత్స అందేలా వెంటనే చర్యలు తీసుకున్నారు.
ఈ సంఘటనలో హరీష్ రావు చూపిన స్పందనకు ప్రజలు అభినందనలు తెలియజేస్తున్నారు. రాజకీయ నాయకుడిగా మాత్రమే కాకుండా, మానవతావాదిగా నిలిచిన ఈ చర్య సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రశంసలందుకుంటోంది.
Read More : బస్ భవన్ వద్ద కార్మికుల ముట్టడి

One thought on “రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కాపాడిన నాయకుడు”
Comments are closed.