కేటీఆర్‌కు మంత్రి సీతక్క కౌంటర్

తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్ధం ముదురుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విసిరిన రైతులపై చర్చ సవాలుకు సంబంధించి కేటీఆర్ స్పందించిన తీరుపై మంత్రి సీతక్క తీవ్రంగా స్పందించారు. కేటీఆర్ విదేశాల్లో ఉండి రాజకీయాలపై వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదమని విమర్శించారు. ‘‘అసెంబ్లీలో చర్చిద్దాం అని ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పారు. అలాంటప్పుడు ప్రెస్ క్లబ్‌కు రమ్మని సవాల్ చేయడమేంటో అర్థం కావడం లేదు. ఓ డెడ్ అయిన పార్టీ డెడ్‌లైన్ పెట్టడం విడ్డూరంగా ఉంది’’ అంటూ మంత్రి సీతక్క ఎద్దేవా చేశారు. ఇంకా ఆమె మాట్లాడుతూ – ‘‘మీ నాన్న కేసీఆర్‌కు ప్రతిపక్ష హోదా ఉంది. ఆయన అసెంబ్లీలోకి వస్తే చర్చకు సిద్ధంగా ఉన్నాం. కానీ మీకు సొంత పార్టీ కూడా నాయకుడిగా గుర్తించడంలేదేమో చూడాలి. సొంత చెల్లెలే నీ నాయకత్వాన్ని అంగీకరించడం లేదు. కేటీఆర్‌ పయనం ఇప్పుడే మొదలయిందా లేక ముగిసిందా అనేది ఆయన నిర్ణయించుకోవాలి’’ అని వ్యాఖ్యానించారు.

ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో అధికార – ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పరిగెడుతున్నాయి. రైతుల సంక్షేమం వంటి కీలక అంశాలపై చర్చ కావాల్సిన సమయంలో వేదికలపైనా మాటలపైనా తేడాలు రావడంపై రాజకీయంగా చర్చ జరుగుతోంది.

Read More : రైతులపై చర్చకు సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్

One thought on “కేటీఆర్‌కు మంత్రి సీతక్క కౌంటర్

Comments are closed.