కృష్ణా జిల్లా గుడివాడ పరిధిలో బహిరంగంగా మద్యం సేవిస్తున్న యువకులను డ్రోన్ కెమెరా ద్వారా గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంజినీరింగ్ కాలేజీ సమీపంలోని పొలాల్లో యువకులు మద్యం సేవిస్తూ ఉండగా, పోలీసులు డ్రోన్ ద్వారా వారి ఆచూకీ తెలుసుకొని వెంటనే స్పందించారు. యువకులు పారిపోవడానికి యత్నించినప్పటికీ చివరికి పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ఈ ఘటనపై రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘‘పొలాల్లో విశ్రాంతి తీసుకుంటున్న వారిని చూస్తే జాలేస్తోంది… కానీ నేనేమీ చేయలేను. పోలీస్ డ్రోన్లు వాటి పని అవి చేస్తాయి’’ అంటూ సెటైరికల్‌గా ట్వీట్ చేశారు. దీనితో పాటు డ్రోన్ పరికరాలు చిత్రీకరించిన వీడియోను కూడా జత చేశారు.

ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మద్యం నియంత్రణలో డ్రోన్‌ల వినియోగంపై పలు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
ఇంకా ఇతర జిల్లా పోలీస్ విభాగాలు కూడా ఇదే తరహా పద్ధతులు అమలు చేయాలంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
Read More : రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి స్పష్టీకరణ

One thought on “కృష్ణా జిల్లా గుడివాడలో డ్రోన్ పర్యవేక్షణలో మద్యం సేవకుల పట్టివేత”
Comments are closed.