పవన్ లేకుండా ప్రమోషన్ కష్టం… మేకర్స్ ఆశలన్నీ మెగాపవర్ స్టార్ పైనే!

Pawan Kalyan Hari Hara Veera Mallu release

పవన్ కళ్యాణ్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘హరిహర వీరమల్లు’ ఇప్పటికే అనేక వాయిదాల తరువాత మే 9న విడుదల చేయాలనే నిశ్చయానికి వచ్చారు మేకర్స్. ఇప్పటివరకు అనేక అనుమానాలు ఉన్నప్పటికీ, ఈసారి మాత్రం తుది నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేస్తున్నారు. మిగిలిన షూటింగ్ కోసం పవన్ కళ్యాణ్ మరో ఐదు రోజుల డేట్స్ ఇవ్వాల్సి ఉంది. ఏప్రిల్ 4 నుంచే డేట్స్ ఇవ్వాల్సి ఉన్నా, రాజకీయ బిజీ షెడ్యూల్లు వల్ల ఆయన అందుబాటులో లేరు.

పవన్ డేట్స్ లేకుండా సినిమా రిలీజ్ వాయిదా పడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మే 9న సినిమా విడుదల చేయాలంటే, ఆయన డేట్స్ ఇవ్వాల్సిందేనని ఇండస్ట్రీలో టాక్. ముఖ్యంగా ఇది పవన్ కళ్యాణ్ తొలి పాన్ ఇండియా మూవీ కావడంతో ప్రమోషన్స్‌లోనూ ఆయన చురుకుగా పాల్గొనాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో, ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా పవన్ పాల్గొనాల్సిన అవసరం ఉన్నందున, మేకర్స్ ఆయనను ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం.

హీరో లేకుండా హీరోయిన్‌తో చేసిన ప్రమోషన్ ఎంతగా చేసినా ప్రజలలో సినిమా గురించి సరైన హైప్ రాదు. పవన్ ఒక్క ఈవెంట్‌కు వచ్చినా సినిమాకు భారీ పబ్లిసిటీ వస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. బాలీవుడ్ ప్రమోషన్ కోసం మీడియా మీట్, టీవీ షోలు వంటి కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంటుంది. పవన్ షెడ్యూల్ బిజీగా ఉన్నా, కనీసం మీడియా సమావేశాల్లో పాల్గొనడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక ఏపీలో జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఆయన హాజరవడం ఖాయంగా భావిస్తున్నారు

Read More

One thought on “పవన్ లేకుండా ప్రమోషన్ కష్టం… మేకర్స్ ఆశలన్నీ మెగాపవర్ స్టార్ పైనే!

Comments are closed.