కేవలం కాంట్రాక్టర్ల కోసమే ప్రాజెక్ట్.. సంచలన వ్యాఖ్యలు చేసిన కవిత

బీఆర్ఎస్ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు కవిత. ఎప్పటికైనా వారు తన దారికి రావాల్సిందేనని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత అన్నారు. న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాతే బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ నిర్ణయాన్ని సమర్థించినట్టు చెప్పారు. బీసీ రిజర్వేషన్లపై రెండు బిల్లులు తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు స్పందించలేదని, అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని కవిత అన్నారు. బనకచర్ల ప్రాజెక్టుపై జాగృతి పోరాడుతుందన్నారు.

కేంద్ర జలశక్తిశాఖ మంత్రి.. ఇద్దరు ముఖ్యమంత్రులతో నిర్వహించిన సమావేశంలో పండగ వాతావరణం కనిపించిందని ఎద్దేవా చేశారు. మొదట బనకచర్ల అంశంపైనే చర్చ జరిగింది. సీఎం రేవంత్రెడ్డి, మంత్రి ఉత్తమ్.. గోదావరి జలాలను అప్పజెప్పి వచ్చారు. జరుగుతున్న నష్టం ఏమిటి? సీఎం అనుసరిస్తున్న వైఖరి ఏమిటి?. టెలీమెట్రీల ఏర్పాటు అంశంలో విషయం లేదు.. కానీ, సీఎం దాన్నితమ విజయంగా చెబుతున్నారు. బనకచర్ల వల్ల ఏపీకి కూడా లాభం లేదు, కుట్ర పూరితంగా కాంట్రాక్టర్ల కోసం చేపడుతున్న ప్రాజెక్టు అని, కాంగ్రెస్, బీజేపీ దారుణంగా మోసం చేస్తున్నాయన్నారు.

బనకచర్లను తక్షణమే ఆపాలి.. లేదంటే జాగృతి న్యాయ పోరాటం చేస్తుంది. బీసీ రిజర్వేషన్లు, బనకచర్లపై అఖిలపక్షాన్ని సీఎం ఢిల్లీకి తీసుకెళ్లాలి” అని కవిత డిమాండ్ చేశారు.

2 thoughts on “కేవలం కాంట్రాక్టర్ల కోసమే ప్రాజెక్ట్.. సంచలన వ్యాఖ్యలు చేసిన కవిత

Comments are closed.