ఒక గది.. ఎన్నో రహస్యాలు! ‘ఖౌఫ్’ హారర్ సిరీస్‌కు రిలీజ్ డేట్ ఫిక్స్

Khauf OTT Release Date

ప్రతి క్షణం ఊపిరి బిగిపట్టేలా చేసే హారర్ డ్రామా ప్రేక్షకులను కలవరపెట్టనుంది. రాజత్ కపూర్, మోనికా పన్వార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఖౌఫ్ పేరిట తెరకెక్కిన ఈ సిరీస్ ఏప్రిల్ 18, 2025న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కి రానుంది. మానవ మానసిక పరిస్థితులను కలవరపరిచే దృశ్యాలతో, భయాన్ని కొత్త కోణంలో చూపించనున్న ఈ సిరీస్‌కు ప్రేక్షకులలో ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి.

ఏప్రిల్ 8న విడుదల చేసిన అధికారిక పోస్టర్‌లో రాజత్ కపూర్, మోనికా పన్వార్ ఉన్న ఒక హోటల్ గదిలో భయంకరంగా కనిపించే శక్తి పక్కనే ఉన్నట్లు చూపిస్తూ, “కొన్ని గదుల్లో జ్ఞాపకాలు ఉంటాయి.. కానీ ఈ గదిలో భయం ఉంది” అనే క్యాప్షన్ జోడించారు. ఈ పోస్టర్ చూసిన నెటిజన్లు – “సూపర్ ఎగ్జయిటెడ్!” అంటూ స్పందించారు. మంచి హారర్ సిరీస్ కోసం ఎదురు చూస్తున్నవారికి ఇది చక్కటి విందుగా నిలవనుంది.

తన గదిలో ఊహించని సంఘటనలు ఎదురవుతుండగా, ఓ యువతి తన గడిచిన జీవితంలోని రహస్యాలను అన్వేషిస్తుంది. ఈ థ్రిల్లింగ్ కథను స్మితా సింగ్ రచించగా, పంకజ్ కుమార్, సూర్య బాలకృష్ణన్ కలిసి దర్శకత్వం వహించారు. మ్యాచ్‌బాక్స్ షాట్స్ పతాకంపై సంజయ్ రౌత్రే, సరితా పటేల్ నిర్మించిన ఈ సిరీస్‌కి అభిషేక్ చౌహాన్, గీతాంజలి కులకర్ణి, శిల్పా శుక్లా వంటి ప్రతిభావంతులైన నటులు ప్రాణం పోస్తున్నారు.

Read More



One thought on “ఒక గది.. ఎన్నో రహస్యాలు! ‘ఖౌఫ్’ హారర్ సిరీస్‌కు రిలీజ్ డేట్ ఫిక్స్

Comments are closed.