భాగ్య శ్రీ బోర్స్ గ్లామర్ గేమ్: ఫ్లాప్ సినిమా నుంచే స్టార్ క్రేజ్!

Bhagyashree Borse Tollywood Entry

ఏ ముహూర్తాన భాగ్య శ్రీ బోర్స్ తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిందో కానీ, అప్పటినుంచి ఆమె వెనక దర్శకులు, నిర్మాతలు వరుస కట్టేస్తున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘మిస్టర్ బచ్చన్’ సినిమా బాక్సాఫీస్ వద్ద మెప్పించకపోయినా, భాగ్య శ్రీ గ్లామర్ మాత్రం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. సినిమాకు ముందు నుంచే సెట్స్ పైకి వెళ్లిన రెండు ప్రాజెక్ట్స్‌లో భాగంగా, విజయ్ దేవరకొండతో చేస్తున్న ‘కింగ్ డమ్’ మరియు రామ్‌తో నటిస్తున్న చిత్రంలో కూడా భాగ్య శ్రీ నటిస్తోంది.

ఇక తెలుగు, తమిళ బైలింగ్వల్‌గా రూపొందుతున్న ‘కాంతా’ సినిమాలోనూ ఆమె కీలక పాత్ర పోషిస్తోంది. ఇలా మూడు సినిమాలతో బిజీగా మారిన భాగ్య శ్రీ 2025లో స్టార్‌డమ్‌ను అందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ భాగ్య శ్రీ చురుకుగా ఉంటూ తన ఫాలోవర్స్‌కి రెగ్యులర్‌గా అప్డేట్స్ ఇస్తోంది. ‘మిస్టర్ బచ్చన్’ టైమ్‌లోనే తెలుగు ఆడియన్స్‌తో మంచి కనెక్ట్ సాధించిన ఆమెకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ రోజురోజుకీ పెరుగుతోంది.

తాజాగా మేకప్ రూమ్‌లో భాగ్య శ్రీ బ్లాక్ డ్రెస్‌లో మిర్రర్ ముందు మెరుస్తూ తీసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. స్టైల్, గ్లామర్‌తో తన క్రేజ్‌ను రెట్టింపు చేస్తూ, ఫోటోషూట్స్ ద్వారా మరింత దృష్టిని ఆకర్షిస్తోంది. ‘మిస్టర్ బచ్చన్’ ఫలితానికి సంబంధం లేకుండా వరుస ఆఫర్లు రావడం విశేషం. అలాంటిది ‘కింగ్ డమ్’, ‘రామ్’ సినిమాలు హిట్టయితే, టాలీవుడ్‌లో భాగ్య శ్రీ రైజ్‌ను ఆపడం అంత తేలిక కాదు!

Read More

One thought on “భాగ్య శ్రీ బోర్స్ గ్లామర్ గేమ్: ఫ్లాప్ సినిమా నుంచే స్టార్ క్రేజ్!

Comments are closed.