టాలీవుడ్లో ‘ఆర్ఎక్స్ 100’, ‘మంగళవారం’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న నటి పాయల్ రాజ్‌పుత్, తాజాగా ఓ ఎమోషనల్ పోస్ట్‌తో మళ్లీ వార్తల్లోకెక్కింది. నెపోటిజం గురించి తన సంచలనాత్మక వ్యాఖ్యల తర్వాత, ఇప్పుడు తన తండ్రి ఆరోగ్యంపై చేసిన భావోద్వేగభరిత పోస్టుతో భావుకత వ్యక్తం చేశారు. తన తండ్రికి ఎసోఫెగల్ కార్సినోమా (జీర్ణాశయ క్యాన్సర్) డయాగ్నోస్ అయిందని, ట్రీట్‌మెంట్‌ను ఇటీవలే ప్రారంభించామని, ఇప్పటికే తొలి కీమోథెరపీ సెషన్ పూర్తయిందని వెల్లడించారు.
ఈ వార్త విని తనకు చాలా భయమేసిందని పాయల్ తెలిపింది. అయినా తన తండ్రి ఆసుపత్రిలో ఉండగానే “నీవు షూటింగ్‌కి వెళ్లి పని చేయాలి” అని ధైర్యం చెప్పారని, ఆ మాటలే తనకు బలాన్నిచ్చాయని పేర్కొన్నారు. హాస్పిటల్‌లో తన తండ్రి చేతికి సెలైన్ ఎక్కిస్తున్న ఫోటోను షేర్ చేస్తూ, కిమ్స్ హాస్పిటల్ డాక్టర్లు, టీమ్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. తన తండ్రి త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ అభిమానుల ప్రేమ, దీవెనలు కోరారు.
ఈ పోస్ట్‌కు పలువురు సెలబ్రిటీలు స్పందించగా, పాయల్‌కి ధైర్యం చెబుతూ రాయ్ లక్ష్మీ, సిమ్రత్ కౌర్, దివ్య పిళ్లై వంటి నటి మిత్రులు మద్దతు పలికారు. అభిమానులు కూడా తమ ప్రార్థనలతో పాయల్‌కు అండగా నిలుస్తున్నారు. ఇక కెరీర్ పరంగా చూస్తే, మంగళవారం సినిమా సక్సెస్ అయినప్పటికీ పెద్దగా అవకాశాలు రాలేదు. ‘మంగళవారం 2’పై వార్తలు వినిపిస్తున్నా, అందులో పాయల్ కాకుండా మరో నటి నటించనున్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం పాయల్ చేతిలో రెండు తమిళ చిత్రాలు, ఒక తెలుగు సినిమా ఉన్నట్లు సమాచారం.

One thought on “తండ్రి ఆరోగ్యంపై పాయల్ ఎమోషనల్ ట్వీట్!”
Comments are closed.