ఒకే ఫ్రేమ్‌లో తారక్, సుక్కూ, వంశీ ఫ్యామిలీస్ – ఈ కలయిక స్పెషల్!

Jr NTR Sukumar Vamshi family gathering

టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ తారలు జూనియర్ ఎన్టీఆర్, దర్శకులు వంశీ పైడిపల్లి, సుకుమార్ ఫ్యామిలీలు ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో సోషల్ మీడియాలో హల్‌చల్ మొదలైంది. ఈ ఫోటో వంశీ పైడిపల్లి భార్య మాలిని పుట్టినరోజు సందర్భంగా తీసుకున్నది. కోలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా ఈ వేడుకలో హాజరయ్యారు. ఆ ఫోటోను సుకుమార్ సతీమణి తబిత తన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పిక్ వైరల్‌గా మారింది.

తబిత ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ, “ఆనందం, నవ్వు, ప్రేమతో నిండిన రోజు. మాలినికి స్పెషల్ బర్త్ డే సెలబ్రేషన్స్.. ఎన్నో మెమోరీస్ క్రియేట్ చేసుకున్నాం, ఇంకా చాలా ఉన్నాయి,” అంటూ తన భావాలను పంచుకున్నారు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ తన సతీమణితో కనిపించిన ఈ ఫోటో నెట్టింట నెటిజన్లను ఆకట్టుకుంటోంది. “ఫ్రెండ్‌షిప్ గోల్స్” అంటూ కామెంట్లు పెడుతుండగా, తారక్ ఉన్న చోట సందడి తప్పదని అభిమానులు తెగ చెబుతున్నారు.

తాజాగా మ్యాడ్ స్క్వేర్ మూవీ సక్సెస్ ఈవెంట్‌కు హాజరైన తారక్, అనంతరం సుకుమార్‌తో రిలాక్స్ అవుతున్న ఫోటో కూడా బయటికి వచ్చింది. ప్రస్తుతం తారక్ “వార్ 2” షూటింగ్ పూర్తి చేసి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నెక్ట్స్ మూవీలో పాల్గొంటున్నారు. మరోవైపు, సుకుమార్ పుష్ప-2 విజయం తర్వాత పుష్ప-3తో పాటు రామ్ చరణ్‌తో ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నారు. వంశీ పైడిపల్లి బాలీవుడ్ స్టార్ ఆమీర్ ఖాన్‌కు కథ వినిపించారని ప్రచారం జరుగుతోంది. కానీ అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు.

Read More

One thought on “ఒకే ఫ్రేమ్‌లో తారక్, సుక్కూ, వంశీ ఫ్యామిలీస్ – ఈ కలయిక స్పెషల్!

Comments are closed.