తమన్ భావోద్వేగ పోస్ట్ – కళ్లల్లో నీళ్లు, హృదయాన్ని హత్తుకున్న సంఘటన!

సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు. సినిమాలకు అద్భుతమైన మ్యూజిక్ అందిస్తూ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్న తమన్, తాజాగా తన ఎమోషనల్ ట్వీట్ ద్వారా అందరినీ కదిలించారు.

తాజాగా తమన్ ఒక వీడియోను షేర్ చేశారు, ఇందులో ఓ వృద్ధుడు హైవే పక్కన కూర్చొని ఓ హోటల్ జండా ఊపుతూ కస్టమర్స్ రప్పించేందుకు శ్రమిస్తున్నాడు. మండుటెండలో, కాళ్లకు చెప్పుల్లేకుండా కష్టపడుతున్న ఆ వ్యక్తిని చూసిన ఓ యువకుడు అతనికి గొడుగు, చెప్పులు, జ్యూస్ అందించి మానవత్వాన్ని చాటుకున్నాడు.

ఈ సంఘటన తమన్‌ను ఎంతగానో ప్రభావితం చేసింది. “కళ్లల్లో నీళ్లు.. హృదయం నిండిపోయింది.. ఇదే నిజమైన ఆనందం!” అంటూ భావోద్వేగంగా పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సంగీతంలోనే కాకుండా, మానవత్వాన్ని గుర్తించి ప్రోత్సహించడంలో కూడా తమన్ ముందుంటారని మరోసారి రుజువైంది!

Read More

One thought on “తమన్ భావోద్వేగ పోస్ట్ – కళ్లల్లో నీళ్లు, హృదయాన్ని హత్తుకున్న సంఘటన!

Comments are closed.