ఖమ్మంలో ఎస్‌ఐ భార్య అనుమానాస్పద మృతి

ఖమ్మం నగరంలో జీఆర్పీ ఎస్‌ఐ రాణా ప్రతాప్ కుమారుడి భార్య రాజేశ్వరి అనుమానాస్పద మృతితో తీవ్ర కలకలం రేగింది. ఈ మృతి హత్యేనని బంధువులు ఆరోపిస్తూ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. తీవ్ర ఆగ్రహంతో ఉన్న వారు స్టేషన్ ఎదుట నిరసన ప్రదర్శనతో పాటు రాణా ప్రతాప్‌పై దాడి చేయడానికి యత్నించారు. స్థానికుల సమాచారం ప్రకారం, ఎస్‌ఐ రాణా ప్రతాప్ గతంలోనూ దురుసు ప్రవర్తనతోపాటు, గన్‌తో బెదిరింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. రాజేశ్వరి మృతిని బంధువులు అనుమానాస్పదంగా భావిస్తున్నారు. ఆమెపై ఒత్తిడితో పాటు మనశ్శాంతి లేకుండా చేశారని, ఈ హత్యకు కారణం కుటుంబ కలహాలేనని వారు ఆరోపిస్తున్నారు.

ఈ ఘటనపై పోలీసులు స్పందించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు పోస్టుమార్టం నివేదికతో వెలుగు చూస్తాయని తెలిపారు. కాగా, ఘటన నేపథ్యంలో స్థానికంగా ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకోవడానికి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు.

read More : తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎన్నికలపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

One thought on “ఖమ్మంలో ఎస్‌ఐ భార్య అనుమానాస్పద మృతి

Comments are closed.