తాడిపత్రిలోకి ప్రవేశానికి సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్.

వైసీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి సుప్రీంకోర్టులో పెద్ద ఊరట లభించింది. తాడిపత్రిలోకి ప్రవేశానికి గ్రీన్‌సిగ్నల్ ఇస్తూ సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు, గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించింది.

వివరాల్లోకి వెళ్తే… తాడిపత్రిలోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారనే ఆరోపణలతో పెద్దారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం, ఆయన వాదనలను సమర్థించింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ దవే, పి. సుధాకర్ రెడ్డి, అల్లంకి రమేశ్ కోర్టులో వాదనలు వినిపించారు. రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వం రాజకీయ కక్షతో వ్యవహరిస్తూ, అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందని వారు వాదించారు.

ఈ సందర్భంగా ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. “మిమ్మల్ని మీ స్వంత నియోజకవర్గంలోకి వెళ్లకుండా ఎవరు ఆపగలరు?” అని ప్రశ్నించింది. భద్రతపై ఆందోళన ఉంటే, అవసరమైతే ప్రైవేట్ సెక్యూరిటీని వినియోగించుకోవచ్చని సూచించింది.

అదే సమయంలో, పెద్దారెడ్డి తాడిపత్రిలో పర్యటించే సమయంలో రాష్ట్ర పోలీసులు తగిన భద్రత కల్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. పోలీసు భద్రత ఖర్చులను తామే భరిస్తామని పెద్దారెడ్డి తరఫు న్యాయవాదులు హామీ ఇవ్వడంతో ధర్మాసనం అంగీకరించింది. దీంతో, కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలో పర్యటించేందుకు ఉన్న న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి.

Read More : సుగాలి ప్రీతి కేసుపై జనసేన ఘాటైన స్పందన.

One thought on “తాడిపత్రిలోకి ప్రవేశానికి సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్.

Comments are closed.