వినాయక చవితి వేడుకల్లో ఆకతాయిలపై షీ టీమ్స్ కఠిన నిఘా.

వినాయక చవితి ఉత్సవాల్లో మహిళల భద్రతకు హైదరాబాద్ షీ టీమ్స్ ప్రత్యేక చర్యలు చేపట్టాయి. పండుగ సందర్భంగా వేధింపులకు పాల్పడే ఆకతాయిలపై కఠిన నిఘా పెట్టినట్లు డీసీపీ లావణ్య వెల్లడించారు.

నవరాత్రుల దృష్ట్యా 16 ప్రత్యేక షీ టీమ్స్‌ను ఏర్పాటు చేసి, ఖైరతాబాద్ వద్ద మూడు బృందాలు రౌండ్ ది క్లాక్ పర్యవేక్షణ చేస్తున్నాయని తెలిపారు. పండుగ మొదటి రోజే 51 మంది ఆకతాయిలను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారిలో 40 మంది పెద్దవారు కాగా, 11 మంది మైనర్లు ఉన్నారని చెప్పారు.

వీడియో సాక్ష్యాల ఆధారంగా పట్టుబడిన పెద్దవారిని కోర్టులో హాజరుపరుస్తామని, మైనర్ల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తామని డీసీపీ లావణ్య వివరించారు. ప్రతి షీ టీమ్‌లో ఆరుగురు సభ్యులు ఉంటారని, చీకటి ప్రదేశాల్లో ప్రత్యేక నిఘా ఉంచామని స్పష్టం చేశారు. వేధింపులకు పాల్పడిన వారిపై BNS సెక్షన్ 292 కింద కేసులు నమోదు చేస్తామని తెలిపారు.

Read More : ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష

One thought on “వినాయక చవితి వేడుకల్లో ఆకతాయిలపై షీ టీమ్స్ కఠిన నిఘా.

Comments are closed.