సంగీత దర్శకుడు కీరవాణి ఇంట తీవ్ర విషాదం…

ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన తండ్రి, ప్రముఖ రచయిత శివశక్తి దత్తా (92) సోమవారం రాత్రి హైదరాబాద్‌ మణికొండలోని తన నివాసంలో మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన స్వగృహంలోనే తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
శివశక్తి దత్తా తెలుగు సినిమాలకు విలక్షణ రచయితగా పేరుగాంచారు. ఆయన రచించిన పాటలు, స్క్రీన్‌ప్లేలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆయన మృతితో తెలుగు సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు సంతాపం తెలియజేస్తూ, ఆయనతో గడిపిన స్మృతులను పంచుకుంటున్నారు. శివశక్తి దత్తా అసలు పేరు కోడూరి సుబ్బారావు. 1932, అక్టోబర్ 8న ఆంధ్రప్రదేశ్‌లోని కొవ్వూరులో జన్మించారు. ఆయనకు ముగ్గురు సంతానం — ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి, సంగీత దర్శకుడు కల్యాణి మాలిక్, రచయిత శివశ్రీ కంచి ఉన్నారు. అంతేకాక, శివశక్తికి సోదరుడిగా ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఉండగా, దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, గాయని శ్రీలేఖకు ఆయన పెద్దనాన్నవుతారు.

శివశక్తి దత్తా అంత్యక్రియలు ఈరోజు (మంగళవారం) మధ్యాహ్నం హైదరాబాద్‌ మహాప్రస్థానంలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

తెలుగు సినిమా రంగానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయంగా నిలుస్తాయని పలువురు ప్రముఖులు భావవేశంతో పేర్కొన్నారు.

Read More : రష్మిక మనసులో బాధ – “వారాంతం కోసం ఏడుస్తున్నా”

One thought on “సంగీత దర్శకుడు కీరవాణి ఇంట తీవ్ర విషాదం…

Comments are closed.