రష్మిక మనసులో బాధ – “వారాంతం కోసం ఏడుస్తున్నా”

జాతీయ స్థాయిలో క్రష్‌గా గుర్తింపు పొందిన నటి రష్మిక మందన్న ఇటీవలి ఇంటర్వ్యూలో తన మనసులోని బాధను స్పష్టంగా వ్యక్తం చేసింది. తెరపై ఎక్కడ చూసినా కనిపించే రష్మిక, తెర వెనుక మాత్రం తన కుటుంబాన్ని, ముఖ్యంగా తన చిన్న చెల్లెలిని ఎంతగా మిస్ అవుతుందో ఆసక్తికరంగా చెప్పింది. “నా వారాంతం కోసం నేను ఏడుస్తున్నాను” అనే మాటలు ఆమె పరిస్థితిని మరో కోణంలో చూపించాయి. తన చెల్లెలికి ఇప్పుడు 13 సంవత్సరాలు అని, తనకూ ఆమెకూ దాదాపు 16 ఏళ్ల వయస్సు తేడా ఉందని తెలిపింది. గత ఎనిమిది సంవత్సరాలుగా సరిగ్గా ఆమెతో సమయం గడపలేకపోతున్నానని, ఏడాదిన్నరగా ఇంటికెళ్లలేకపోయానని చెప్పిన రష్మిక, తన మాటల్లోని బాధను ఆవిష్కరించింది. తన తల్లి చెప్పిన ఒక మాటను గుర్తుచేసింది – “కెరీర్‌లో ముందుకెళ్లాలంటే, వ్యక్తిగత జీవితంలో ఏదో ఒకటి వదులుకోవాల్సి ఉంటుంది.” రష్మిక మాత్రం రెండింటినీ బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నానని, కానీ అది సులభం కాదని పేర్కొంది.

Read More : రిషబ్ శెట్టి పుట్టినరోజు సందర్భంగా ‘కాంతార

One thought on “రష్మిక మనసులో బాధ – “వారాంతం కోసం ఏడుస్తున్నా”

Comments are closed.