వడోదర బ్రిడ్జి ప్రమాదం విషాదం: మృతుల సంఖ్య 18కి పెరిగింది

గుజరాత్ రాష్ట్రం వడోదరలో జరిగిన ఘోర బ్రిడ్జి ప్రమాదం మరిన్ని ప్రాణాలను బలితీసుకుంది. గంభీర బ్రిడ్జి కూలిన ఈ ఘటనలో ఇప్పటివరకు మృతుల సంఖ్య 18కి చేరింది. ఈ ప్రమాదంతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదం నెలకొంది. గల్లంతైన వారికోసం ఎన్డీఆర్ఎఫ్ (NDRF) బృందాలు మహిసాగర్ నదిలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఇంకా ఇద్దరి ఆచూకీ లభించాల్సి ఉంది. ఉదయం నుంచి సుదీర్ఘంగా కొనసాగుతున్న రేస్క్యూ ఆపరేషన్‌లో అధికారులు అత్యంత జాగ్రత్తగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు, పోలీస్ విభాగాలు, వైద్య బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినప్పటికీ మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. బ్రిడ్జి కూలటానికి గల కారణాలపై విచారణ కొనసాగుతోంది.

ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. వడోదర ఘటన రాష్ట్రాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

Read More : బీహార్ ఓటరు జాబితా సవరణపై సుప్రీం కోర్టు అసంతృప్తి

2 thoughts on “వడోదర బ్రిడ్జి ప్రమాదం విషాదం: మృతుల సంఖ్య 18కి పెరిగింది

Comments are closed.