తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న రాష్ట్ర కేబినెట్ నిర్ణయాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హర్షాతిరేకంగా స్వాగతించారు. గురువారం ఆమె ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ, బీసీల హక్కులను పరిరక్షించేందుకు తీసుకున్న ఈ కీలక నిర్ణయం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న చట్టాన్ని సవరించి కొత్త రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని ప్రభుత్వ ఆలోచనను కవిత అభినందించారు. ఈ విషయంలో అవసరమైన చర్యలు వెంటనే ప్రారంభించాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ జాగృతి సంస్థ ప్రారంభం నుంచే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కోసం గళమెత్తుతోందని, ఈ కేబినెట్ నిర్ణయం ఆ పోరాటానికి అందిన ఘనవిజయమని కవిత అభివర్ణించారు. తాను “జై బీసీ – జై జాగృతి” అనే నినాదాలతో ఈ గెలుపును ప్రజలతో పంచుకున్నారు.
Read More : కేటీఆర్ వ్యంగ్యంగా ప్రధానికి సూచన
