వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్ రెడ్డి ఇటీవల పల్నాడు జిల్లాలో చేపట్టిన సత్తెనపల్లి పర్యటన విషాదం మిగిల్చిన సంగతి తెలిసిందే. ఈ పర్యటన సందర్భంగా జరిగిన దుర్ఘటనలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. వాటిలో ఓ సంఘటనలో జగన్ బుల్లెట్ ప్రూఫ్ వాహనం చక్రాల కింద పడి సింగయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఇద్దరి పేర్లు ప్రత్యేకంగా చేర్చిన కేసులో, జగన్‌పై కూడా పోలీసులు నమోదు చేసినట్టు తెలుస్తోంది. ఈ కేసులో ఆయనను రెండో నిందితుడిగా పేర్కొన్నారు. ఇప్పటికే కారు డ్రైవర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు, ఘటనకు సంబంధించిన వాహనాన్ని సీజ్ చేశారు.
ఈ నేపథ్యంలో జగన్‌తో పాటు కేసులో ఉన్న మరికొంతమంది నిందితులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌ను స్వీకరించిన హైకోర్టు ఈ కేసుపై రేపు (బుధవారం) విచారణ చేపట్టనున్నట్లు పేర్కొంది.
Read More : శ్రీకాకుళం జిల్లా తీరులో విద్యా సంక్షోభం
