భారీ వర్షం, పోలీసుల ఒత్తిడి మధ్య కవిత దీక్ష

బీసీ రిజర్వేషన్ల కోసం ఎమ్మెల్సీ కవిత చేపట్టిన 72 గంటల దీక్షకు వాతావరణం, పోలీసుల నుంచి అడ్డంకులు ఎదురయ్యాయి. ఒకవైపు హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తుండగా, మరోవైపు దీక్షాస్థలిని ఖాళీ చేయాలంటూ పోలీసులు నాయకులు, కార్యకర్తలపై ఒత్తిడి తీసుకొచ్చారు.

పోలీసులు ఈ చర్యను ఖండించిన బీఆర్ఎస్ శ్రేణులు, దీక్షను విరమించే ప్రసక్తే లేదని స్పష్టం చేశాయి. ఎంత వర్షం వచ్చినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా కవిత దీక్ష కొనసాగుతుందని నాయకులు పేర్కొన్నారు. వర్షంలో కూడా కార్యకర్తలు దీక్షాస్థలిలో కవితకు మద్దతుగా నిలిచి నినాదాలు చేశారు. ఈ ఘటనతో దీక్షాస్థలి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Read More : బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శ – రామచందర్ రావు

One thought on “భారీ వర్షం, పోలీసుల ఒత్తిడి మధ్య కవిత దీక్ష

Comments are closed.