జగన్‌పై నారా లోకేశ్ ఘాటు వ్యాఖ్యలు.

అమరావతి, ఆంధ్రప్రదేశ్‌పై వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రచారంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు. ఎక్స్‌ వేదికగా వైసీపీ అధినేత జగన్‌పై ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ, చట్టం ముందు ఆయన తప్పనిసరిగా దోషిగా నిలబడతారని హెచ్చరించారు.

“అమరావతి పైనా, ఆంధ్రప్రదేశ్ పైనా జగన్ కక్ష ఇంకా తీరలేదా?” అని ప్రశ్నించిన లోకేశ్, తమిళనాడులోని వీడియోను తెచ్చి అమరావతిగా ప్రచారం చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి అందరిదని, ఇక్కడ ఎటువంటి వివక్షకు చోటు లేదని స్పష్టం చేశారు. ఇది బౌద్ధం పుష్పించిన నేల అని, కుల, మత, ప్రాంత భేదాలు లేకుండా ప్రజలు సోదర భావంతో కలిసి జీవిస్తారని గుర్తు చేశారు.

ప్రాంతాల మధ్య విద్వేషాలు రేపే, కులాల కుంపట్లు వేస్తూ మతాల మధ్య చిచ్చులు పెడుతున్న జగన్ రెడ్డి కుతంత్రాలకు కాలం చెల్లిపోయిందని లోకేశ్ వ్యాఖ్యానించారు. కిరాయి మూకల ద్వారా కుల కలహాలు రేపే కుట్రలను చట్టం కట్టడి చేస్తుందని, ఈ మొత్తం వ్యవహారం వెనుక ఉన్న జగన్ రెడ్డి చివరికి చట్టం ముందు తప్పనిసరిగా దోషిగా నిలబడతారని ఆయన స్పష్టం చేశారు.

Read More : ఫ్యామిలీ కార్డు పై సీఎం కీలక నిర్ణయాలు.

One thought on “జగన్‌పై నారా లోకేశ్ ఘాటు వ్యాఖ్యలు.

Comments are closed.