జూన్ 27న విడుదల కానున్న కన్నప్ప – సీఎం యోగి సమక్షంలో పోస్టర్ ఆవిష్కరణ

Kannappa Movie Release Date

మంచు విష్ణు హీరోగా, ముకేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపొందుతున్న పౌరాణిక చిత్రం కన్నప్ప తాజాగా కీలక మైలురాయిని అధిగమించింది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా మంచు విష్ణు, మోహన్ బాబు, ప్రభుదేవా, ఎగ్జిక్యూటివ్ నిర్మాత వినయ్ మహేశ్వరి లతో కూడిన టీం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను లక్నోలో కలిసి, ఆయన సమక్షంలో సినిమా పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జూన్ 27, 2025న కన్నప్ప సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

ఈ సమావేశంలో సీఎం యోగికి సినిమా నేపథ్యంపై ఒక స్పెషల్ వీడియో చూపించారు. భక్త కన్నప్ప పురాణ గాథను ఆధారంగా తీసుకుని ఈ సినిమాను అద్భుతమైన విజువల్స్, ఉత్కంఠభరితమైన కథనంతో రూపొందిస్తున్నట్టు తెలిపారు. వీడియో చూసిన సీఎం యోగి, సినిమా బృందం చేసిన కృషిని అభినందించారు. భారతీయ సంస్కృతి, పురాణ గాధలను సినిమాల ద్వారా సమాజానికి పరిచయం చేయడంలో ఇటువంటి ప్రాజెక్టుల పాత్ర అమోఘమని ప్రశంసించారు.

ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ కన్నప్ప చిత్రం భారతీయ సినిమా చరిత్రలో ఒక గొప్ప స్థానం సంపాదిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. తిరుపతిలోని మోహన్ బాబు విశ్వవిద్యాలయాన్ని ముఖ్యమంత్రి సందర్శించాలని ఆహ్వానించారు. మంచు విష్ణు మాట్లాడుతూ, “నా జీవితాన్ని కన్నప్ప ముందు, తర్వాత అని విభజించుకోవచ్చు. ఇది కేవలం సినిమా కాదు, భక్తి, సంస్కృతి పునరుజ్జీవనానికి ప్రతీక” అని తెలిపారు. అగ్రతారాగణం మోహన్‌లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్, కాజల్ అగర్వాల్ లతో కలసి వస్తున్న ఈ గ్రాండ్ విజువల్ ఎక్స్‌పీరియన్స్‌కు ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

Read More

One thought on “జూన్ 27న విడుదల కానున్న కన్నప్ప – సీఎం యోగి సమక్షంలో పోస్టర్ ఆవిష్కరణ

Comments are closed.