బాలీవుడ్లో తనదైన శైలితో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వచ్చిన అక్షయ్ కుమార్, ఇటీవల వరుస ఫ్లాప్‌లతో ఒత్తిడిలో ఉన్నారు. అయినప్పటికీ కొత్త కంటెంట్‌తో ముందుకు రావాలని నిశ్చయించుకున్నారు. ఇటీవల ఓ విభిన్న గెటప్‌లో కనిపించి అందరికీ షాకిచ్చారు. కథకళి వేషధారణలో ఉన్న అక్షయ్ కుమార్ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది కథకళి కళను చూపించడమే కాదు, ఆయన చేసే పాత్ర గొప్పతనాన్ని కూడా ప్రతిబింబిస్తుంది.
ప్రస్తుతం అక్షయ్ కుమార్ కేసరి 2 సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆయన సి శంకరన్ నాయర్ అనే పాత్రలో కనిపించనున్నారు. జలియన్ వాలాబాగ్ ఊచకోత తర్వాత న్యాయం కోసం పోరాడిన వ్యక్తి పాత్రను అక్షయ్ ఎంతో నిబద్ధతతో పోషిస్తున్నారు. “ఇది వేషధారణ కాదు… ఇది సంప్రదాయం, ప్రతిఘటన, నా దేశానికి సత్యానికి చిహ్నం,” అంటూ క్యాప్షన్‌తో తన ఫోటోను షేర్ చేశారు. ఈ పాత్రకు సంబంధించి ఆయన చేసిన పోస్టు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
కేసరి 2 సినిమా ట్రైలర్ ఇప్పటికే విడుదలై మంచి స్పందనను పొందింది. ఈ చిత్రం సి శంకరన్ నాయర్ నేతృత్వంలోని చారిత్రాత్మక న్యాయపోరాటం ఆధారంగా రూపొందింది. బ్రిటిష్ వారిపై చట్టబద్ధంగా సాగిన పోరాటాన్ని ఈ చిత్రం ప్రతిబింబించనుంది. ఏప్రిల్ 18న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. భారత చరిత్రలోని ఓ మరిచిపోయిన వీరుడి కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

One thought on “వెండితెరపై విభిన్న ప్రయోగం.. కథకళి గెటప్‌లో అక్షయ్ కుమార్”
Comments are closed.