ఉత్తరప్రదేశ్‌లో భర్తను హత్య చేసిన భార్య ..

ఉత్తరప్రదేశ్‌లో హృదయ విదారక ఘటన వెలుగుచూసింది. 27 ఏళ్ల మహిళ తన భర్తను హత్య చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటోంది. భర్త ఉద్యోగం రైల్వే శాఖలో ఉండటంతో, ఆ ఉద్యోగాన్ని పొందాలనే కోరికతో ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడిందని పోలీసులు తెలిపారు.

ఆ హత్యను హార్ట్ అటాక్‌లా నమ్మించేందుకు ఆమె ప్రయత్నించినట్టు విచారణలో తేలింది. అయితే, పోస్ట్‌మార్టం నివేదికలో అసలు నిజాలు బయటపడ్డాయి. గొంతు నులిమి రోప్‌తో హత్య చేసినట్టు వైద్యులు తేల్చారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి, ఆమెను అరెస్ట్ చేశారు.

ప్రస్తుతం ఆమె విచారణ కొనసాగుతోంది. భర్తను పొగొట్టి ఉద్యోగం దక్కించుకోవాలనే ప్రయత్నం తీవ్రంగా ఆవేదన కలిగిస్తోంది.

Read More : స్టీరింగ్‌ ఒకరికి, గేర్‌ మరొకరికి – ప్రజల ప్రాణాలతో చెలగాటం

One thought on “ఉత్తరప్రదేశ్‌లో భర్తను హత్య చేసిన భార్య ..

Comments are closed.