ఫైర్ బ్రాండ్ కంగనా కొత్త సెటైర్: ఖాళీ ఇల్లుకు లక్ష కరెంటు బిల్లు!

Kangana Ranaut electricity bill controversy

బాలీవుడ్ ఫైర్‌ బ్రాండ్ హీరోయిన్, ప్రస్తుతం ఎంపీగా ఉన్న కంగనా రనౌత్ మరోసారి వార్తల్లో నిలిచింది. సాధారణంగా సినీ ప్రముఖులు రాజకీయాలకు దూరంగా ఉండేందుకు ఆసక్తి చూపుతారు. కానీ కంగనా మాత్రం ఎప్పటి నుంచో తన బోల్డ్ కామెంట్స్‌తో పాటు, బహిరంగ అభిప్రాయాలతోనే చర్చల్లో ఉంటూ వచ్చింది. ఎంపీగా గెలిచిన తర్వాత కూడా తన ఫైర్ బ్రాండ్ స్టైల్‌ను కొనసాగిస్తూ, రాజకీయ వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తూ వస్తోంది.

తాజాగా కంగనా తన స్వస్థలమైన హిమాచల్‌ ప్రదేశ్‌లోని మనాలీలో ఉన్న ఇంటికి సంబంధించిన అంశంతో వార్తల్లోకి వచ్చింది. ఆమె ఇటీవల సోషల్ మీడియాలో చేసిన పోస్ట్‌లో, తాను ఉండకపోయినప్పటికీ తన ఖాళీగా ఉన్న మనాలీ ఇంటికి లక్ష రూపాయల కరెంట్ బిల్లు వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసింది. కేవలం వేసవి సీజన్‌లో మాత్రమే ఆమె ఆ ఇంటికి వెళ్తుందని, ఎక్కువగా ముంబై లేదా ఢిల్లీలోనే ఉంటానని చెబుతూ, కరెంట్ బిల్లుపై రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించింది. అధికార పార్టీ పరిపాలన అస్థవ్యస్తంగా ఉందని మండిపడింది.

ఈ వివాదంతో సోషల్ మీడియా హీట్ పెరిగింది. కంగనా వ్యాఖ్యలపై హిమాచల్ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి, ఆమె ఇంటికి వచ్చిన అధిక కరెంట్ బిల్లుపై విచారణ చేపట్టింది. తాను అబద్ధం చెప్పినట్లు తేలితే కేసు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇటీవల కంగనా నటించిన “ఎమర్జెన్సీ” సినిమా థియేటర్లలో ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయినా, ఓటీటీలో మాత్రం మంచి రిస్పాన్స్ వచ్చింది. ఆమె నటనకు పలువురు రాజకీయ ప్రముఖుల ప్రశంసలు లభించాయి. ఎంపీగా బిజీగా ఉన్న కంగనా మళ్లీ నటిగా ఫుల్ స్వింగ్‌లో ఎప్పుడు వస్తుందా అనే ఆసక్తితో అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Read More

One thought on “ఫైర్ బ్రాండ్ కంగనా కొత్త సెటైర్: ఖాళీ ఇల్లుకు లక్ష కరెంటు బిల్లు!

Comments are closed.