పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పటికే మూడు సినిమాలకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. అందులో మొదటగా కమిట్ అయిన చిత్రం “హరిహర వీరమల్లు”. తరువాత “ఉస్తాద్ భగత్ సింగ్”, “ఓజి” సినిమాలకు డేట్స్ ఇచ్చారు. కానీ ఏపీ రాజకీయ పరిస్థితుల కారణంగా పవన్ షెడ్యూల్ మారిపోయింది. రాజకీయాల్లో బిజీ అవడం, ఎన్నికల సమయంలో హిస్టారికల్ విక్టరీ సాధించడం వల్ల సినిమాలకి తక్షణమే డేట్స్ ఇవ్వలేకపోయారు.
ఇప్పటికీ “హరిహర వీరమల్లు” చివరి షెడ్యూల్ ఏప్రిల్ 7 నుంచి 14 వరకు జరుగనుంది. ఈ వారంలో పవన్ కేవలం నాలుగు రోజులు మాత్రమే షూటింగ్‌లో పాల్గొంటారు. క్రిష్ దర్శకత్వంలో జ్యోతి కృష్ణ షూట్ చేసిన ఫుటేజీతో కలిసి ఫైనల్ కాపీని సిద్ధం చేస్తున్నారు. వివిధ విదేశీ కంపెనీలు వీఎఫ్ఎక్స్ పనులను పూర్తి చేస్తున్నాయి. ఈసారి మే 9న చిత్రాన్ని రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.
పవన్ అభిమానులు “హరిహర వీరమల్లు”పై ఆసక్తి కోల్పోయినట్టు అనిపించినప్పటికీ, మేకర్స్ ఈసారి మాట నిలబెట్టుకునేలా కనిపిస్తున్నారు. ఫస్ట్ కాపీని సిద్ధం చేసి ఏప్రిల్ చివరి వారంలో సెన్సార్ పూర్తిచేయాలని ప్లాన్ చేస్తున్నారు. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. పవన్ ఫ్యాన్స్, హరిహర వీరమల్లు విడుదలకు రెడీగా ఉండొచ్చు!

One thought on “హరిహర వీరమల్లు రిలీజ్‌కు లైన్ క్లియర్!”
Comments are closed.