కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ దర్యాప్తును నిలిపివేయాలని కోరుతూ బీఆర్‌ఎస్ అధినేత, మాజీ మంత్రి హరీశ్ రావు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా తమపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం ఆదేశించాలని ఆయన పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు.
అయితే, ఈ పిటిషన్‌పై అత్యవసర విచారణకు లేదా మధ్యంతర ఉత్తర్వుల జారీకి హైకోర్టు నిరాకరించింది. సాధారణ కేసుల మాదిరిగానే విచారణ కొనసాగుతుందని, రేపు ఉదయం 10.30 గంటలకు విచారణ చేపడతామని కోర్టు స్పష్టం చేసింది. అప్పటివరకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాతే తదుపరి నిర్ణయం వెలువడుతుందని న్యాయస్థానం పేర్కొంది.
కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ జరిపిస్తామని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై చర్చ అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రాజెక్టు నిర్మాణంలో కేంద్ర సంస్థలు, ఇతర రాష్ట్రాల ప్రమేయం ఉన్నందున సీబీఐ విచారణే సరైనదని ప్రభుత్వం భావిస్తోంది.
అసెంబ్లీ తీర్మానం అనంతరం వెంటనే కేసీఆర్, హరీశ్ రావు హైకోర్టును ఆశ్రయించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. రేపటి హైకోర్టు విచారణపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
Read More : ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి తెలంగాణలో సన్మానం

One thought on “కాళేశ్వరం సీబీఐ విచారణపై హైకోర్టులో హరీశ్ రావు పిటిషన్.”
Comments are closed.