కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి బహిర్గతమవడంతో బీజేపీ వైఖరి సరికాదని మరోసారి రుజువైందని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఈ అవకతవకలకు బీఆర్ఎస్ పూర్తి బాధ్యత వహించాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ, “కాళేశ్వరం అవినీతిపై మేము మొదటి నుంచే సీబీఐ విచారణ కోరుతున్నాం. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్‌ను రక్షించే ఉద్దేశ్యంతోనే ఇంతకాలం చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు ఒత్తిడి ఎదుర్కొని సీబీఐ విచారణకు అంగీకరించింది. ఇక ఆలస్యం చేయకుండా వెంటనే లేఖ పంపాలి” అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ తీరును ఆయన తీవ్రంగా విమర్శించారు. గతంలో ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌ఆర్) టోల్ టెండర్లపై కాంగ్రెస్ సిట్‌ను ప్రకటించినా, ఇప్పటివరకు ఫలితం కనిపించలేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా డైలీ సీరియల్‌లా సాగుతోందని ఆయన వ్యాఖ్యానించారు.
కాళేశ్వరం అవినీతి బయటపడిన నేపథ్యంలో బీఆర్ఎస్ నైతిక బాధ్యత వహించాలని బండి సంజయ్ స్పష్టం చేశారు.
Read More : కాళేశ్వరం సీబీఐ విచారణపై హైకోర్టులో హరీశ్ రావు పిటిషన్.

One thought on “బీఆర్ఎస్ బాధ్యత వహించాలి: బండి సంజయ్”
Comments are closed.