కర్ణాటక ముడా కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కీలక ముందడుగు వేసింది. దాదాపు రూ.400 కోట్ల ఆర్థిక అక్రమాలకు సంబంధించిన ఈ వ్యవహారంలో, రూ.100 కోట్ల విలువ చేసే 92 స్థిరాస్తులను అధికారులు జప్తు చేశారు.
ఈ స్కాం కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు కాంగ్రెస్‌కు చెందిన పలువురు ప్రముఖ నాయకుల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (MUDA)కి సంబంధించిన భూకుంభకోణంలో ప్రభుత్వ భూములను అవకతవకల ద్వారా ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టినట్టు ఈడీ విచారణలో వెల్లడైంది.
ఈ క్రమంలో పెద్ద ఎత్తున ఆస్తులను సేకరించిన వారి పేర్లపై దర్యాప్తు కొనసాగుతోంది. మొత్తం రూ.400 కోట్ల విలువైన స్కాం నేపథ్యంలో ఇప్పటివరకు రూ.100 కోట్ల స్థిరాస్తులను అధికారులు తాత్కాలికంగా జప్తు చేశారు. ఈ కేసులో మరిన్ని ఆధారాలు వెలుగు చూస్తుండటంతో, త్వరలో మరిన్ని అరెస్టులు లేదా ఆస్తుల జప్తు జరిగే అవకాశముంది.

Read More : లక్నోలో 25 ఏళ్ల న్యాయవాది కుప్పకూలి మృతి

One thought on “రూ.100 కోట్ల ఆస్తులు జప్తు చేసిన ఈడీ”
Comments are closed.