కాకాణి బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

క్వార్ట్జ్ అక్రమ రవాణా కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది. నెల్లూరు ఎస్సీ, ఎస్టీ మెజిస్ట్రేట్ కోర్టులో ఈ కేసుకు సంబంధించిన విచారణ జరుగగా, తదుపరి విచారణను ఈ నెల 18వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు న్యాయమూర్తి ప్రకటించారు. ఈ కేసు సంబంధించి ఇప్పటికే పలుమార్లు విచారణ వాయిదా పడుతుండటంతో తదుపరి తీర్పుపై ఆసక్తి నెలకొంది.

Read More : విశాఖలో యోగాంధ్ర ఏర్పాట్లను సమీక్షించిన సీఎం