జనగామ జిల్లా పాలకుర్తి మండలం లక్ష్మీనారాయణపురం గ్రామానికి చెందిన యాట అర్చన (22) అనే గర్భిణీ, ప్రసూతి కోసం రెండు రోజుల క్రితం పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది.
ఆసుపత్రి వైద్యులు నార్మల్ డెలివరీ చేస్తామని భరోసా ఇచ్చినా, మూడు రోజుల తరువాత గర్భిణీ ఆరోగ్య పరిస్థితి మోటపడటంతో తమ వద్ద చికిత్స చేయలేమని చేతులెత్తేసారు. కుటుంబ సభ్యులకు ఈ విషయాన్ని తెలియజేసి, ఆమెను వెంటనే ఇతర ఆసుపత్రికి తరలించాల్సిందిగా సూచించారు.
కుటుంబసభ్యులు అత్యవసరంగా అర్చనను సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినా, అప్పటికే పరిస్థితి విషమించడంతో పసికందు మృతిచెందింది.
ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన గర్భిణీ కుటుంబసభ్యులు, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యమే తమ బిడ్డ మృతికి కారణమని ఆరోపిస్తూ ఆసుపత్రి ఎదుట నిరసన చేపట్టారు.
స్థానికులు ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Read More : నాగర్‌కర్నూల్‌లో ఘోర హత్య…
