నాగర్‌కర్నూల్‌లో ఘోర హత్య…

నాగర్ కర్నూల్ – అచ్చంపేట మండలం నడింపల్లి గ్రామానికి చెందిన వీరయ్య(55) చిన్న కొడుకు పరమేశ్, అదే గ్రామానికి చెందిన భర్త, ఇద్దరు పిల్లలు ఉన్న ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు

అయితే నెల రోజుల కింద ఆమెను ఏపీలోని గురజాలకు తీసుకెళ్లి సహ జీవనం చేశాడు

వారి ఆచూకీ తెలుసుకున్న కుటుంబసభ్యులు అక్కడికి వెళ్లి యువకుడిని చితకబాది, సదరు మహిళను తీసుకువచ్చారు. ఈ విషయంలో ఆగ్రహంగా ఉన్న మహిళ బంధువులు, మంగళవారం వీరయ్య, తన పెద్ద కొడుకు వెంకటేశ్‌తో కలిసి అచ్చంపేట నుంచి నడింపల్లికి బైక్ పై వెళ్తున్న విషయాన్ని గుర్తించారు

దీంతో ఇటుక బట్టీల వద్ద మాటు వేసి కారుతో బైక్ ను ఢీకొట్టి.. ఆ తరువాత వారి కళ్లల్లో కారం చల్లి సుత్తి, గొడ్డలితో దాడి చేశారు

వీరయ్య అక్కడికక్కడే చనిపోగా, స్వల్ప గాయాలతో వెంకటేశ్ తప్పించుకున్నాడు. విషయం తెలుసుకొని హైదరాబాద్ – అచ్చంపేట ప్రధాన రహదారిపైనే డెడ్ బాడీని ఉంచి రాస్తారోకో చేసిన గ్రామస్థులు