అక్రమ కట్టడాల తొలగింపు, ప్రజల నుంచి అభినందనలు!

హైదరాబాద్‌లోని వనస్థలిపురం, ఇంజాపూర్‌లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు చర్యలు తీసుకున్నారు.

ఐస్క్రీమ్ కంపెనీ వద్ద రోడ్డును కబ్జా చేసి నిర్మించిన నిర్మాణాలను హైడ్రా బృందం కూల్చివేసింది. దీంతో చాలా కాలంగా రహదారి సమస్యతో ఇబ్బంది పడుతున్న స్థానికులకు ఊరట లభించింది.

ప్రజలకు తిరిగి రోడ్డు అందించడంపై హైడ్రా అధికారుల కృషిని అభినందిస్తూ స్థానికులు ‘హైడ్రా జిందాబాద్’, ‘ఏవీ రంగనాథ్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేశారు.

Read More : తెలంగాణలో TDP ఎమ్మెల్యేకు భారీ షాక్!